: భారీగా ‘స్వచ్ఛ్ కర్నూలు’ కార్యక్రమం!
స్వచ్ఛ్ భారత్ అభియాన్ లో భాగంగా నేడు కర్నూలులో భారీ కార్యక్రమం జరుగుతోంది. నగరంలోని విద్యా సంస్థలు, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 2 లక్షల మంది ప్రజలు పాలుపంచుకోనున్నారు. ఉదయం పది గంటలకే నగరంలోని ప్రధాన కూడలి రాజ్ విహార్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. భారీ సంఖ్యలో ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి చరిత్ర సృష్టించేందుకు కర్నూలు వాసులు యత్నిస్తున్నారు.