: కేసీఆర్ మత్తులో ఉండి మాట్లాడుతున్నారు: దేవినేని ఉమ
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన తెలంగాణ సీఎం కేసీఆర్ మత్తులో ఉండి మాట్లాడారని ఏపీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఏమాత్రం ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్న కేసీఆర్, తన తప్పంతా ఏపీపై నెట్టేందుకు యత్నిస్తున్నారని విరుచుకుపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలపై శనివారం ఉదయం మీడియాతో మాట్లాడిన సందర్భంగా దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తిలా కేసీఆర్ వ్యవహరించడం లేదని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ వ్యవహార సరళిని తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన చెప్పారు. భాషతో పాటు పద్ధతి కూడా మార్చుకోవాలని కేసీఆర్ కు సూచించారు. కేసీఆర్ మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధమేనన్నారు. తెలంగాణ దుస్థితికి కేసీఆర్ ముందుచూపులేని వైఖరే కారణమన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలు తమ దృష్టిలో సమానమేనన్నారు.