: లాభాల కోసమే జగన్ కంపెనీల్లో పెట్టుబడులు: హెటిరో


లాభాలు ఆశించే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంపెనీలైన జనని ఇన్ ఫ్రా, జగతి పబ్లికేషన్లలో పెట్టుబడులు పెట్టామని హెటిరో సంస్థ తెలిపింది. తమ వాదనను పరిగణనలోకి తీసుకుని తమకు కేసు నుంచి విముక్తి కల్పించాలని కోర్టును కోరింది. ఈ మేరకు ఆ సంస్థ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హెటిరో పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శుక్రవారం మరోమారు విచారించారు. ఈ సందర్భంగా హెటిరో న్యాయవాదులు పలు అంశాలను లేవనెత్తారు. కేవలం జగన్ ను కేసులో ఇరికించేందుకే సీబీఐ తమ క్లయింట్లపై ఆరోపణలు చేస్తోందని వారు వెల్లడించారు. సూరీడు ఇచ్చిన వాంగ్మూలంలోని అందరిపై కేసులు నమోదు చేయని సీబీఐ, తమపై మాత్రమే కేసు ఎలా నమోదు చేస్తుందని హెటిరో ప్రశ్నించింది. ఉద్దేశపూర్వకంగానే సీబీఐ తమపై కేసు నమోదు చేసిందని, ఈ నేపథ్యంలో తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోర్టును కోరింది.

  • Loading...

More Telugu News