: ఇద్దరు చంద్రులపై ధ్వజమెత్తిన వైకాపా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీఎస్ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావులపై వైకాపా ధ్వజమెత్తింది. వీరిద్దరి అహంకారంతో ఇరు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైకాపా నేత శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇంతకుముందే కూర్చొని మాట్లాడుకుని ఉంటే... శ్రీశైలం సమస్య ఇంత దూరం వచ్చేది కాదని అన్నారు. ఇద్దరు సీఎంలు, ఉన్నతాధికారులంతా హైదరాబాదులోనే ఉన్నప్పటికీ... ఈ సమస్య తలెత్తడం దురదృష్టకరమని చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టులకు నీరు అందాలంటే శ్రీశైలంలో 854 అడుగుల మేర నీటి మట్టం ఉండాలని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో ప్రతిరోజు 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని... దీనివల్ల 3 నుంచి 4 టీఎంసీల నీరు వృథాగా పోతోందని అన్నారు. ఈ నీటిని కాపాడాలని... వెంటనే విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని సూచించారు.