: దోపిడీదార్ల పేర్లను త్వరలోనే బయటపెడతా: మల్లు భట్టివిక్రమార్క
తెలంగాణలోని కాంగ్రెస్ నేతల్లో చాలా మంది యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. ఎప్పుడూ మీడియాలో కనిపించే నేతలు కూడా కొద్ది కాలంగా సైలెంట్ అయిపోయారు. ఈ నేపథ్యంలో, ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క మాత్రం తనదైన శైలిలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ, విమర్శలకు పదును పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డంగా దోచేస్తున్నారని... త్వరలోనే దోపిడీదార్ల పేర్లను బయటపెడతానని హెచ్చరించారు. మరోవైపు సీఎం కేసీఆర్ ను కూడా మల్లు డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం హవా నడుస్తోందని... మోసపూరిత హామీలతో అధికారం దక్కించుకున్న కేసీఆర్... మాటల గారడితో రోజులు నెట్టుకొస్తున్నారని మండిపడ్డారు.