: తాడేపల్లిగూడెం వద్ద వోల్వో బస్సు బోల్తా, 11 మందికి గాయాలు
అతి వేగంగా దూసుకెళుతూ ప్రజల ప్రాణాలను గాలిలో కలిపేస్తున్న వోల్వో బస్సుల ప్రమాదాలు రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సు ఒకటి ప్రమాదానికి గురైంది. కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్న వోల్వో బస్సు తాడేపల్లిగూడెం వద్ద అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది వ్యక్తులు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.