: చెన్నై సూపర్ కింగ్స్ పని అయిపోయినట్టేనా?


స్టార్ క్రికెటర్లతో కూడి, ఐపీఎల్ లో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్తు నీటి బుడగలా మారింది. ఏ క్షణంలోనైనా ఈ ఫ్రాంఛైజీపై వేటు పడే అవకాశాలు సుస్పష్టమవుతున్నాయి. ఐపీఎల్-6లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ లో గురునాథ్ చుట్టూ ఉచ్చు బిగుస్తుండటమే దీనికి కారణం. గురునాథ్, విందూ దారాసింగ్ మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చి చెప్పారు. సంభాషణలోని గొంతు గురునాథ్ దే అని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన నివేదికను త్వరలోనే ముద్గల్ కమిటీ సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఈ క్రమంలో, చెన్నై సూపర్ కింగ్స్ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారయింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడే గురునాథ్ అన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News