: ఇంటికే ఎఫ్ఐఆర్ పత్రాలు... బెజవాడలో రేపటి నుంచి అమలు
విజయవాడ పోలీసులు కొత్త కార్యక్రమానికి నాంది పలికారు. కేసుల్లో నిందితులైన వ్యక్తుల ఇళ్లకే ఎఫ్ఐఆర్ కాపీలను అందజేయనున్నారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలో తొలుత ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.