: కేసీఆర్ అజెండా సంపాదనే: నాగం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చూపంతా అవినీతిపైనే ఉందని... సంపాదనే అతని అజెండాగా మారిందని బీజేపీ నేత నాగం జనార్ధనరెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలను కేసీఆర్ పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. రోజుకు ఒక గంట సమయాన్ని కూడా రైతుల కోసం ఆయన కేటాయించడం లేదని అన్నారు. కరెంట్ సమస్యను తీర్చకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.