: ఇంఫాల్ లో రోడ్లు ఊడ్చిన మేరీకోమ్


భారత స్టార్ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత మేరీకోమ్ మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో రోడ్లు ఊడ్చారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా ఆమె చీపురు పట్టారు. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ స్వచ్ఛ భారత్ లో పాల్గొన్న తర్వాత... మేరీకోమ్ కూడా ఇందులో భాగస్వామి కావాలని ప్రతిపాదించారు. ఆయన ఆహ్వానం మేరకు మేరీకోమ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిశుభ్రమైన భారతదేశం కోసం చేపట్టిన ఈ కార్యక్రమంలో తనను పాల్గొనేలా చేసిన అనిల్ అంబానీకి ఈ సందర్భంగా మేరీకోమ్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, మేరీకోమ్ స్వచ్ఛ భారత్ లో పాల్గొనడంపై భారత ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మోరీకోమ్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం... ప్రజల్లో ఉత్తేజాన్ని నింపుతుందని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News