: 'సాగర్ లో విద్యుదుత్పత్తి నిలిపివేయండి'... కేసీఆర్ కు టీకాంగ్ నేత గుత్తా లేఖ


నాగార్జునసాగర్ డ్యాం వద్ద ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుదుత్పత్తిని వెంటనే నిలిపివేయాలంటూ టీకాంగ్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. రబీ పంట కోసం రైతులకు నీరు అందేలా చూడాలని సూచించారు. అలాగే, శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం 834 అడుగులు ఉండేలా చూడాలని తెలిపారు. విద్యుదుత్పత్తి కోసం నీటిని వాడుతూ పోతే, ఆయకట్టు పరిధిలోని పంటలు నీరు లేక ఎండిపోతాయని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News