: ప్రధాన పార్టీలు పోటీ చేయనందువల్లే ఏకగ్రీవంగా గెలిచా!: భూమా అఖిల


ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం పట్ల భూమా అఖిల ప్రియ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన పార్టీలు పోటీ చేయకపోవడం, ఇండిపెండెంట్లు నామినేషన్లు ఉపసంహరించుకోవడం వల్లే తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని వినమ్రంగా తెలిపారు. పేదల కోసం పనిచేయాలనే తన తల్లి ఆశయ సాధన కోసం పాటుపడతానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కుటుంబ సభ్యులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. వైకాపా అధినేత జగన్ కు, నియోజకవర్గ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News