: చంద్రబాబువన్నీ హత్యా రాజకీయాలే అంటున్న వైకాపా నేత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై హత్యా రాజకీయాలు, దాడులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. బాబుకు ముందు నుంచీ కూడా హత్యా రాజకీయాలు అలవాటేనని అన్నారు. చంద్రబాబు పరిపాలనా కాలమైన 1999 నుంచి 2004 వరకు 400 మంది హత్యకు గురయ్యారని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తండ్రి రాజారెడ్డిని హత్య చేసిన వారికి టీడీపీ ఆఫీసులోనే వసతి కల్పించిన ఘనత చంద్రబాబుదే అని విమర్శించారు. తమ అధినేత జగన్ నేతృత్వంలో హత్యా రాజకీయాలను ఎదిరిస్తామని... వైకాపా నేతలు, కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు.