: దీపావళి నాడూ పాక్ బరి తెగించింది: రాజ్ నాథ్ సింగ్


నిత్యం సరిహద్దు వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్, దీపావళి పర్వదినాన కూడా తన దుశ్చర్యలకు విరామం ఇవ్వలేదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ‘మేమెప్పుడూ కవ్వింపు చర్యలకు పాల్పడలేదు. ఎప్పుడు కాల్పులకు దిగినా, పాక్ కాల్పులకు ప్రతిచర్యగానే స్పందించాం. ఇప్పటికైనా పాకిస్థాన్ తన దుశ్చర్యలకు స్వస్తి చెప్పాల్సి ఉంది’ అని ఆయన శుక్రవారం వ్యాఖ్యానించారు. తాము శాంతిని కోరుకుంటున్నా, పాక్ మాత్రం తీరు మార్చుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాతో సరిహద్దు సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని రాజ్ నాథ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News