: మాజీ గవర్నర్ వీఎస్ రమాదేవి కన్నుమూత


మాజీ గవర్నర్ వీఎస్ రమాదేవి (79) నేడు కన్ను మూశారు. అనారోగ్యం కారణంగా ఆమె ఈరోజు బెంగళూరులో తుది శ్వాస విడిచారు. గతంలో ఆమె కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లకు గవర్నర్ గా వ్యవహరించారు. 1990లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగానూ బాధ్యతలు నిర్వహించిన రమాదేవి, కొంతకాలం లా కమిషన్ సభ్యరాలిగానూ సేవలందించారు. అంతేగాకుండా, తెలుగులో పలు నవలలు, వ్యాసాలు రాసి తన సాహితీ పిపాసను చాటుకున్నారు. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలులో జన్మించారు.

  • Loading...

More Telugu News