: హర్యానా పాన్ వాలాకు రూ.132 కోట్ల కరెంట్ బిల్లు!


హర్యానాకు చెందిన పాన్ వాలా రాజేశ్ కు ఈ దీపావళి సందర్భంగా ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ షాకిచ్చింది. సోనేపట్ జిల్లాలోని గోహనాలో ఓ చిన్న పాన్ షాప్ నిర్వహిస్తున్న అతడికి రూ.132.29 కోట్ల మేర విద్యుత్ ను వాడుకున్నారని హర్యానా ఎలక్ట్రిసిటీ బోర్డు బిల్లు జారీ చేసింది. ‘బిల్లును చూసి షాక్ కు గురయ్యాను. అంకెల్లో తప్పు పడిందేమో అని పరిశీలనగా చూడగా, అక్షరాల్లోనూ అంతే మొత్తం ఉంది’ అంటూ అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఓ చిన్న అద్దె షాపులో పాన్ షాప్ ను నిర్వహిస్తున్నాను. ఓ బల్బుతో పాటు ఒక ఫ్యాన్ మాత్రమే వినియోగించే నాకు నెలకు రూ.1,000 లోపే బిల్లు వస్తోంది. అయితే ఈ సారి మాత్రం షాకిచ్చే బిల్లే వచ్చింది’ అని ఆ పాన్ వాలా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అక్టోబర్ కు సంబంధించిన ఈ భారీ బిల్లును తీసుకుని రాష్ట్ర విద్యుత్ శాఖ ను కలుస్తానని అతడు చెప్పాడు.

  • Loading...

More Telugu News