: వారెన్ బఫెట్ ఆస్తి కరిగిపోతోంది!


విఖ్యాత పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ ఆస్తి నానాటికీ కరిగిపోతోందట. బఫెట్ నేతృత్వంలోని బర్క్ షైర్ హ్యాత్ వేస్ ఆస్తులు జూన్ నుంచి ఇప్పటిదాకా దాదాపు 5 బిలియన్ డాలర్ల మేర తగ్గిపోయాయి. బర్క్ షైర్ ఆధ్వర్యంలోని ఏడు సంస్థలు, వివిధ పారిశ్రామిక సంస్థల్లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాయి. మొన్నటిదాకా నష్టమన్న మాటే ఎరుగని బఫెట్ కు ప్రస్తుతం కాలం కలిసివచ్చినట్టు లేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం ఇతర కంపెనీల్లో పెట్టుబడులతోనే అపర కుబేరుడిగా ఎదిగిన బఫెట్, తాజాగా నష్టాల బాట పట్టారు. ఆయన సంస్థలు పెట్టుబడులు పెట్టిన పలు కంపెనీల షేర్ల విలువ క్రమంగా తగ్గిపోతోందట. ఈ నేపథ్యంలో గడచిన నాలుగు నెలల్లోనే 5 బిలియన్ డాలర్ల మేర ఆయన ఆస్తులు కరిగిపోయాయి. అంతేగాక, సమీప భవిష్యత్తులో ఆయన పెట్టుబడులు పెట్టిన కంపెనీల షేర్ల విలువ పెరిగే అవకాశాలూ లేవట. దీన్నిబట్టి, బఫెట్ ఆస్తులు మరింత క్షీణించడం ఖాయమేనని అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News