: సంజూ కోసం 'పీకే' స్పెషల్ స్క్రీనింగ్


బాలీవుడ్ విలక్షణ నటుడు అమీర్ ఖాన్ తాజా చిత్రం 'పీకే' టీజర్ ను దీపావళి సందర్భంగా ఆవిష్కరించారు. టీజర్ ను లాంచ్ చేసిన అనంతరం అమీర్ ఖాన్ మాట్లాడుతూ, జైల్లో ఉన్న సంజయ్ దత్ కోసం 'పీకే' చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తామని చెప్పాడు. సంజయ్ దత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తాడు. సంజయ్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ అంశంపై దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో మాట్లాడానని అమీర్ తెలిపాడు. అయితే, స్పెషల్ స్క్రీనింగ్ కు అధికారులు అనుమతించాల్సి ఉంటుందని ఈ 'మిస్టర్ పర్ఫెక్షనిస్ట్' అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో శక్తిమేర ప్రయత్నిస్తామని స్పష్టం చేశాడు. కాగా, 'పీకే' క్రిస్మస్ కు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News