: హలో అంటున్న 'ఎలో'... సరికొత్త సోషల్ మీడియా వెబ్ సైట్ రంగప్రవేశం
సోషల్ మీడియా వినియోగం ఎంతో విస్తృతమైంది. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి ప్రముఖ సోషల్ మీడియా సైట్లు అనుసంధాన నెట్ వర్క్ లుగా ఎంతో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడదే తరహాలో మరో వెబ్ సైట్ రంగప్రవేశం చేసింది. దాని పేరు 'ఎలో'. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన పాల్ బడ్ నిట్జ్ దీని రూపకర్త. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపైనే చర్చ సాగుతోంది. ఎలో... యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని అత్యంత సురక్షితంగా ఉంచుతుంది. అయితే, ఎలో అకౌంట్ తెరవడం అంత సులువు కాదు. ఫేస్ బుక్ లో అయితే, మన వివరాలతో అకౌంట్ ఓపెన్ చేసేయొచ్చు. ఇందులో అలాకాదు. ముందు మనం ఎలో వెబ్ సైట్ కు అభ్యర్థన పంపాల్సి ఉంటుంది. వారు అంగీకరిస్తేనే, మన అకౌంట్ ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం ఈ వెబ్ సైట్ కు గంటకు 35000 అభ్యర్థనలు అందుతున్నాయట.