: సాగర్ నీటి విడుదలపై వివాదం


నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి కోసం నీటిని విడుదల చేయడంపై వివాదం నెలకొంది. నీటి విడుదల నిలిపివేయాలంటూ పులిచింతల ప్రాజెక్టు ఎస్ఈ నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్ఈకి లేఖ రాశారు. నీటిని విడుదల చేయడం వల్ల పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 3 గ్రామాలు నీటమునిగాయని, మరో 8 గ్రామాలకు ముప్పు పొంచి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. అటు, జెన్ కో అధికారులు తాము నిబంధనల మేరకే విద్యుదుత్పత్తి చేస్తున్నామని అంటున్నారు.

  • Loading...

More Telugu News