: బిగ్ బీ ట్విట్టర్ ఖాతాలో 1.1 కోట్ల మంది ఫాలోయర్లు!
బాలీవుడ్ అగ్ర నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ఖాతా, దీపావళి నాడు రికార్డు స్థాయిలో ఫాలోయర్లతో మోత మోగించింది. దీపావళి సందర్భంగా అమితాబ్ కు ఏకంగా ఒక కోటి పది లక్షల మంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో ప్రముఖ నటీనటులు హేమా మాలిని, మాధురీ దీక్షిత్, జుహీ చావ్లా తదితరులున్నారు. దీపావళి శుభదినాన ఇంత మంది శుభాకాంక్షలు తెలపడం తనకు ప్రత్యేకమైనదేనని బిగ్ బీ ఈ సందర్భంగా ట్వీట్ చేశాడు. తన నట జీవితంతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలను నిత్యం ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకునే అమితాబ్ కు పెద్ద సంఖ్యలో ఫాలోయర్లున్న సంగతి తెలిసిందే. దాదాపు నలభై ఏళ్ల పాటు బాలీవుడ్ లో ప్రస్థానం కొనసాగిస్తున్న బిగ్ బీ, ఇప్పటికీ పలు చిత్రాలతో పాటు ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ టీవీ షోతో బిజీబిజీగా గడుపుతున్నారు.