: విజయవాడలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం


ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడకు ఔటర్ రింగ్ రోడ్డును కేంద్రం మంజూరు చేసిందని ఎంపీ కేశినేని ప్రకటించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాలను కలుపుతూ భారీ రింగ్ రోడ్డును నిర్మించనున్నామని ఆయన తెలిపారు. వీజీటీఎం(విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి) హుడా పరిధిలోని 180 కిలోమీటర్లలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సుమారు 20 వేల కోట్లను మంజూరు చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపిందని ఆయన అన్నారు. కేవలం భూసేకరణ కోసమే ప్రభుత్వం నాలుగు వేల కోట్ల భారీ మొత్తాన్ని కేటాయించిందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుతో విజయవాడ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు చొరవతోనే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఇంత త్వరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.

  • Loading...

More Telugu News