: దమ్ముంటే నల్లకుబేరుల పేర్లు వెల్లడించు: జైట్లీకి సవాల్ విసిరిన దిగ్విజయ్


నల్లకుబేరుల జాబితాలో కాంగ్రెస్ నేతల పేర్లున్నాయంటూ... పేర్లను లీక్ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. దమ్ముంటే జాబితాలోని పేర్లను వెల్లడించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సవాల్ విసిరారు. రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిన్న జైట్లీ మీడియాతో మాట్లాడుతూ, విదేశాల్లో నల్లధనం దాచిన వివరాలు వెల్లడైతే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందుల పాలవుతుందని... యూపీఏ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి పేరు లిస్టులో ఉందని తెలిపారు. ఈ వార్తలు సంచలనం రేపాయి. దీనిపై స్పందిస్తూ, జైట్లీకి సవాల్ విసిరారు దిగ్విజయ్ సింగ్.

  • Loading...

More Telugu News