: గూగుల్ ద్వారా సురక్షితమైన 'ఇన్ బాక్స్'


వినియోదారుల కోసం గూగుల్ సంస్థ సరికొత్త ఈ మెయిల్ సర్వీసును లాంచ్ చేసింది. దాని పేరు 'ఇన్ బాక్స్'. దీనిద్వారా, బ్యాంకు స్టేట్ మెంట్లు, డిజిటల్ రిసిప్ట్ లు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని సురక్షితంగా భద్రపరుచుకోవచ్చు. మెయిల్ ఓపెన్ చేయగానే... సోషల్ మీడియా మెయిళ్ళు, ప్రమోషనల్ మెయిళ్ళ ఐకాన్ పక్కనే ఈ ప్రత్యేక 'ఇన్ బాక్స్' కూడా దర్శనమిస్తుంది. ఇది రిమైండర్ లాగా పనిచేస్తుంది. విమాన ప్రయాణ వివరాలను అప్ డేట్స్ సహా ప్రముఖంగా చూపిస్తుంది. దీన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, ఐఫోన్లలోనూ యాక్సెస్ చేయవచ్చు.

  • Loading...

More Telugu News