: శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. కిల్లిపాలెంలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లాను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు. నాగావళి కరకట్టను త్వరలోనే పునర్నిర్మిస్తామని తెలిపారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు.