: చేపలుప్పాడ గ్రామాన్ని దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి వెంకయ్య
హుదూద్ తుపానుతో దెబ్బతిన్న విశాఖ ప్రాంతంలోని చేపలుప్పాడ గ్రామాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆయన కుటుంబ సభ్యులు దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాన్ని తమ కుటుంబం పునర్నిర్మిస్తుందని వెంకయ్య తెలిపారు. ఎంపీ నిధుల నుంచి ఈ గ్రామానికి రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు.