: ఈయన ఫేస్ బుక్ 'మర్యాద రామన్న'
ఫేస్ బుక్ లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 7,185. వీళ్ళలో ఆర్చురో బేజర్ స్పెషల్. ఆయనది చాలా క్లిష్టమైన జాబ్. అలాగని ఆయనేమీ సంస్థ యాడ్ రెవెన్యూ పెంచాల్సిన బాధ్యతను తలకెత్తుకున్నాడనో, వెబ్ సైట్ ను 24 గంటలూ నడపాల్సిన బాధ్యత ఇతనిపైనే ఉందనో అనుకుంటే, అది పొరబాటే. బేజర్ పనేంటంటే... 1.3 బిలియన్ల మంది యూజర్లకు 'మర్యాద' నేర్పడమే. ముఖ్యంగా, టీనేజర్లకి. ఇతర యూజర్లతో ఎలా మెలగాలి? పరస్పరం ఎలా గౌరవించుకోవాలి? అన్న అంశాలను ఈయన ఆన్ లైన్ లో బోధిస్తాడు. డైరక్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఫేస్ బుక్ ప్రొటెక్ట్ అండ్ కేర్ టీం బాధ్యతలు నిర్వర్తిస్తున్న బేజర్ కర్తవ్యమల్లా యూజర్లలో సాత్వికతను పెంపొందించడమే. ఫేస్ బుక్ లో వేధింపుల ఘటనలు నానాటికీ పెరిగిపోతుండడంతో బేజర్ సేవలకు ప్రాధాన్యం ఏర్పడింది. చాలామంది తమ ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను మూసివేయడానికి ఆయా సైట్లలో కామెంట్లు ద్వేషపూరితంగా ఉండడమే కారణమని బేజర్ విశ్లేషించారు. అయితే, ఫేస్ బుక్ లో తాము కొన్ని టూల్స్ ను అందిస్తున్నామని, తద్వారా, అభ్యంతరకర ఫొటోలు, కామెంట్లపై రిపోర్టు చేసే వీలుంటుందని తెలిపారు.