: రాత్రికి రాత్రే హైదరాబాద్ టీడీపీ ఆఫీస్ ను భూస్థాపితం చేస్తాం: మహేందర్ రెడ్డి


నిన్న నల్గొండలో టీడీపీ చేపట్టిన బంద్ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా, తాము తలుచుకుంటే తెలంగాణ భవన్ ఇటుక కూడా మిగలదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ''మీకు దమ్ముంటే తెలంగాణ భవన్ గేటు కాడికి రండి, చూసుకుందాం'' అంటూ సవాల్ విసిరారు. తమను రెచ్చగొడితే రాత్రికి రాత్రే హైదరాబాద్ టీడీపీ కార్యాలయాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అంతుచూసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News