: మోదీకి కాల్పులతో స్వాగతం పలికిన పాక్ దళాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం సియాచిన్ పర్యటనకు బయలుదేరారు. సియాచిన్ లోని భారత జవాన్లతో కలిసి ఆయన దీపావళి జరుపుకోనున్నారు. మరో వైపు, మోదీ సియాచిన్ సెక్టార్ పర్యటన వేళ భారత్ ను రెచ్చగొట్టేందుకు సరిహద్దులో పాక్ బలగాలు మరో సారి కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఉదయం, రామ్ గఢ్ సెక్టార్ లో భారత్ శిబిరాలపై పాక్ సైనికులు కాల్పులు జరిపారు.