: టీఆర్ఎస్ సర్పంచ్ భర్త దారుణ హత్య
టీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ అలివేలు భర్త తిరుపతయ్య (40)ను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు మండలం తిప్పారెడ్డిపల్లిలో జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.