: ఒట్టావాలో జరిగిన దాడి వార్తలతో కలత చెందా: మోదీ
ఒట్టావాలో ఉన్న కెనడా పార్లమెంటుపై ముష్కరులు జరిపిన దాడిని భారత ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. శాంతియుత వాతావరణానికి ఇలాంటి చర్యలు విఘాతం కలిగిస్తాయని చెప్పారు. దాడి జరిగిన వార్తను విన్న తర్వాత తీవ్రంగా కలత చెందానని ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నానని చెప్పారు.