: ఫ్రెంచ్ ఓపెన్ లో పారుపల్లి కశ్యప్ శుభారంభం


ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ లో తెలుగు తేజం పారుపల్లి కశ్యప్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ లో బుధవారం నాటి మొదటి రౌండ్ లో ప్రపంచ నాలుగో ర్యాంక్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కెనిచి టాగో (జపాన్) ను మట్టి కరిపించాడు. 21-11, 21-18 స్కోరు తేడాతో టాగోను చిత్తు చేసిన కశ్యప్ రెండో రౌండ్ లోకి ప్రవేశించాడు. 28వ ర్యాంకులో ఉన్న కశ్యప్ కేవలం 34 నిమిషాల్లోనే వరుస సెట్లలో టాగోను ఓడించాడు. మరోవైపు మహిళల సింగిల్స్ లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ రెండో రౌండ్ లోకి ప్రవేశించింది.

  • Loading...

More Telugu News