: విశాఖ... ఏపీకి ఆయువుపట్టు: చంద్రబాబు


అందమైన సుందర నగరంగా ప్రసిద్ధిగాంచిన విశాఖ, ఆంధ్రప్రదేశ్ కు ఆయువుపట్టులాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. హుదూద్ తుపాను కారణంగా నగరం విధ్వంసానికి గురైందని, అయితే నగరానికి తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సర్వ శక్తులు ఒడ్డుతామని ఆయన ప్రకటించారు. తుపాను బాధితుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీలో చంద్రబాబు మాట్లాడారు. కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు. విశాఖకు వీలయినంత మేర సాయం చేసేందుకు వెంకయ్యనాయుడు కృషి చేస్తున్నారన్నారు. విశాఖ నగరం రాష్ట్రానికి ఆర్థికంగానూ, పారిశ్రామికపరంగానూ రాజధానేనని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News