: విశాఖ వాసుల గుండె నిబ్బరం అమోఘం: వెంకయ్యనాయుడు


విశాఖ వాసులు, హుదూద్ తుపానుకు ఎదురొడ్డి నిలిచిన వైనం అమోఘమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ లో కొనసాగిన ఆత్మ విశ్వాస ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన విశాఖ వాసుల గుండె నిబ్బరాన్ని కీర్తించారు. విశాఖ వాసుల ఆత్మ విశ్వాసం దేశానికే ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుల కృషి ఫలితంగా విశాఖకు పూర్వ వైభవం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News