: విశాఖలో ఆత్మవిశ్వాస ర్యాలీ ప్రారంభం
తుపాను బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించిన ఆత్మవిశ్వాస ర్యాలీ కొద్దిసేపటి క్రితం విశాఖలో ప్రారంభమైంది. ఈ ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా పలువురు మంత్రులు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. విశాఖలోని ఆర్కే బీచ్ లో చేపట్టిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాలుపంచుకుంటున్నారు. భారీ జన సందోహంతో ర్యాలీ కొనసాగుతోంది.