: కాంగ్రెస్ కు సోనియా, రాహుల్ లే దిక్కు: డీఎస్


కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే దిక్కని ఆ పార్టీ సీనియర్ నేత డి. శ్రీనివాస్ అన్నారు. సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీనే పార్టీని ముందుండి నడిపిస్తారని ఆయన తెలిపారు. బుధవారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీకి సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని డీఎస్ చెప్పారు. రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ భావి నేతగా ఆవిర్భవించనున్నారన్నారు.

  • Loading...

More Telugu News