: ‘భూరి’ బహుమతుల యజమాని...చదివింది నాలుగో తరగతే!
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తన సంస్థలో పనిచేస్తున్న వెయ్యి మందికి పైగా ఉద్యోగులకు కార్లు, ఫ్లాట్లు, నగలను బహుమతులుగా అందించిన సవ్జీభాయ్ ధొలాకియా దేశవ్యాప్తంగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. వజ్రాల వ్యాపారిగా వినుతికెక్కిన ఆయన కంపెనీ ప్రస్తుతం ఏటా రూ.6 వేల కోట్ల టర్నోవర్ తో దూసుకెళుతోంది. అయితే ఆయన చదివింది మాత్రం నాలుగో తరగతేనట. వజ్రాల వ్యాపారంలో ఉన్న తన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేందుకు 12 ఏళ్ల వయసులోనే ఆయన తన విద్యాభ్యాసానికి స్వస్తి చెప్పారు. అంతేకాదండోయ్, తన ముగ్గురు సోదరులు కూడా చదువుకు మధ్యలో స్వస్తి పలికారట. తన ఎదుగుదలకు కారణం, తన సిబ్బందేనని గర్వంగా చెప్పుకునే ధొలాకియా, దీపావళి బహుమతులకు వారు అర్హులేనని ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ బహుమతుల కోసం ధొలాకియా వెచ్చించిన మొత్తం రూ.50 కోట్లట.