: చారిత్రక ప్రదేశాల్లో సినిమా షూటింగులు నిషేధించనున్న కర్ణాటక సర్కారు!


‘డర్టీ పిక్చర్’ చూసిన వారికి విద్యాబాలన్, నసీరుద్దీన్ షాల మధ్య సాగే ఓ రొమాంటిక్ పాటే గుర్తుంటుంది. అదే సినిమా చూసిన భారత పురావస్తు శాఖ, కర్ణాటక ప్రభుత్వాలకు మాత్రం, ఆ పాటలో హీరోహీరోయిన్ల వెనుక ఉన్న చారిత్రక ప్రదేశాలు, సదరు పాటలోని అశ్లీల సాహిత్యం... ఆ ప్రాంతాలకు కలిగిస్తున్న నష్టం కనిపించాయి. ఇంకేముంది, ఇకపై చలన చిత్రాల షూటింగ్ లను హంపి, బీదర్, బాదామీ లాంటి చారిత్రక కట్టడాల్లో అనుమతించరాదని నిర్ణయించాయి. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం త్వరలో ఆదేశాలు జారీ చేయనుంది. చారిత్రక ప్రదేశాల్లో నిర్ణీత సమయంలో నిర్దేశిత స్థలాన్నే చిత్ర నిర్మాణానికి వినియోగిస్తామన్న నిర్మాతలు, ఆ తర్వాత పరిధి దాటుతున్నారని కూడా కర్ణాటక ఆరోపిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే, దేశవ్యాప్తంగా ఈ నిషేధం విధించాలని పురావస్తు శాఖ డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో, అప్పుడే నష్ట నివారణ చర్యలకు దిగిన చలన చిత్ర ప్రముఖుల మాటలను పరిగణనలోకి తీసుకునేందుకు కర్ణాటక సర్కారు ఏమాత్రం మొగ్గు చూపడం లేదట.

  • Loading...

More Telugu News