: భారత్-వెస్టిండీస్ వ్యవహారంపై ఐసీసీ ఆందోళన
భారత్, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుల మధ్య నెలకొన్న వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, ఇందులో తాము జోక్యం చేసుకోలేమంటూ నిస్సహాయత వెలిబుచ్చింది. ఈ గొడవను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, వచ్చే నెలలో దీనిపై చర్చిస్తామని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, టూర్ ను రద్దు చేసుకున్నందుకు విండీస్ పై చర్యలు తీసుకునే అధికారం మాత్రం తమకు లేదని వెల్లడించింది. వివాదం రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య ద్వైపాక్షిక టూర్ ప్రోగ్రామ్ కు సంబంధించినదని వివరించింది. దుబాయ్ లో నవంబర్ 10న జరిగే ఐసీసీ బోర్డు మీటింగ్ లో ఈ సమస్యపై చర్చిస్తామని పేర్కొంది. అప్పటివరకు ఈ అంశంపై వ్యాఖ్యానించబోమని స్పష్టం చేసింది.