: విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరైన దృష్టి పెట్టలేదు: చంద్రబాబు


శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపే అంశంపై టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న రాద్ధాంతంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత వివరంగా స్పందించారు. ఈ ఏడాది జులైలో కృష్ణా బోర్డు వద్దకు రెండు రాష్ట్రాలూ వెళ్లాయని... 69, 107 జీవోల అమలుకు రెండు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయని చెప్పారు. అప్పుడు బోర్డు ముందు ఒప్పుకుని ఇప్పుడెందుకు తెలంగాణ ప్రభుత్వం గొడవ చేస్తోందని ప్రశ్నించారు. "మీ అసమర్థతను మాపై రుద్దడం సమంజసమా?" అని సీఎం అడిగారు. ఈ మేరకు హైదరాబాదులోని ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరైన దృష్టితో ఆలోచించలేదన్నారు. కానీ, తాము (ఏపీ) ముందు చూపుతో విద్యుత్ ను యూనిట్ కు రూ.6 పెట్టి కొనుగోలు చేశామని చెప్పారు. అయినా, తెలంగాణ ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తాము 300 మెగావాట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యామని బాబు వివరించారు.

  • Loading...

More Telugu News