: తీహార్ ఖైదీలకు దీపావళి బొనాంజా
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు పండుగలకు ప్రత్యేక నజరానాలు అందుకోవడం సర్వసాధారణం. కానీ, ఖైదీలకు కూడా పండుగ బొనాంజా అందివ్వాలని తీహార్ జైలు వర్గాలు నిర్ణయించాయి. దీపావళిని పురస్కరించుకుని వారి దినసరి వేతనాన్ని దాదాపు రెట్టింపు చేశారు. ప్రస్తుతం నైపుణ్యం కలిగిన ఖైదీలు రోజుకు రూ.99 పొందుతుండగా, ఇక మీదట వారికి రూ.171 ముట్టజెప్పనున్నారు. ఓ మోస్తరు నైపుణ్యం కలిగిన ఖైదీలకు రూ.81 నుంచి రూ.138... నైపుణ్యం లేని ఖైదీలకు రూ.71 నుంచి రూ.107లకు వేతనాన్ని పెంచారు. వేతనాలను పెంచామన్న వార్త చెప్పగానే ఖైదీలు ఎంతో సంతోషించారని ఓ అధికారి తెలిపారు.