: సోషల్ మీడియాలో మహిళలూ వేధింపులకు దిగుతున్నారు!


మొన్న జగన్ సోదరి షర్మిళ, నిన్న అరకు ఎంపీ కొత్తపల్లి గీత...తాజాగా అహ్మదాబాద్ కు చెందిన వ్యాపార వేత్త అరిహంత్. వీరు ముగ్గురూ సోషల్ మీడియాలో వేధింపులకు గురైనవారే. వీరిలో తొలి ఇద్దరు మహిళల గురించి తెలుసు. మూడో వ్యక్తి మహిళలా కనబడటం లేదు కదూ. నిజమే అరిహంత్ 27 ఏళ్ల పురుషుడు. ఇతడిపై సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడిన వ్యక్తి ఓ మహిళ. ఇప్పటిదాకా సోషల్ మీడియాలో పురుషుల ద్వారా మహిళలు వేధింపులకు గురైతే, తాజాగా పురుషులు మహిళల ద్వారా వేధింపులకు గురవడం మొదలైందని అహ్మదాబాద్ సైబర్ క్రైం విభాగం పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా ఫిర్యాదు బహుశా ఇదే మొదటిదేమోనని కూడా వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం సోషల్ మీడియాలో ప్రవేశించిన ప్రియాంక అనే సదరు మహిళ, తాను అందంగా లేకున్నా, ఆకర్షణీయంగా ఉన్న మరో మహిళ ఫొటోతో అరిహంత్ ను ఆకట్టుకుంది. ఏడాదిన్నరగా ఇద్దరు చాటింగ్ లో కబుర్లు చెప్పుకున్నారు. తీరా ముఖాముఖిగా కలిసిన అరిహంత్, ప్రియాంక అసలు రూపాన్ని చూసి కంగుతిన్నాడు. ఆ తర్వాత అతడు ఆమెకు క్రమంగా దూరం జరిగేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అరిహంత్ సెల్ నెంబర్ తో పాటు, అతడి తల్లి ఫోన్ నెంబర్ ను కూడా సంపాదించిన ప్రియాంక రెండేళ్లుగా వారిని వేధింపులకు గురి చేస్తోంది. దీంతో, ఆమె వేధింపులకు వేగలేక అరిహంత్ ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News