: 'సత్యమేవ జయతే' సీజన్-3లో సల్మాన్ ఖాన్


బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న 'సత్యమేవ జయతే' సీజన్-3లో నటుడు సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నాడు. ఈ మేరకు ప్రసారమవుతున్న ఓ ఎపిసోడ్ లో సల్లూ కనిపిస్తాడు. తాజాగా అందుకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. అందులో కార్యక్రమ సెట్స్ లో ఉన్న లైవ్ ఆడియన్స్ కు తన స్నేహితుడైన సల్లూను అమీర్ పరిచయం చేస్తాడు. దాంతో, ఒక్కసారిగా అక్కడివారంతా ఆశ్చర్యపోతారు. అమీర్, సల్మాన్ ఇద్దరూ నవ్వుకుంటూ ఆలింగనం చేసుకుంటారు. దానికి సంబంధించి ఎపిసోడ్ ఈ నెల 26న (అంటే ఆదివారం) ప్రసారంకానుంది.

  • Loading...

More Telugu News