: మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్


పాకిస్థాన్ మరోసారి సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ, తాజాగా, జమ్మూకాశ్మీర్ లోని రాంగఢ్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ పోస్టులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. బుధవారం ఉదయం జరిగిన ఆ దాడుల్లో పాక్ సైనికులు తేలికపాటి ఆటోమేటిక్ ఆయుధాలు వినియోగించారని ఓ పోలీసు అధికారి తెలిపారు. పాక్ కాల్పులను బీఎస్ఎఫ్ జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారు. దీంతో, అక్కడ కాల్పులు ఆగిపోయాయి. అనంతరం, పాక్ సైనికులు ఆర్ఎస్ పురాలో కాల్పులకు దిగారు. ప్రస్తుతం అక్కడ కాల్పులు జరుగుతున్నాయని ఆ పోలీసు అధికారి చెప్పారు.

  • Loading...

More Telugu News