: సల్మాన్ కు ప్రధాని ప్రశంసలు
'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో భాగంగా చీపురు పట్టి ఊడ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. సల్మాన్ ప్రయత్నం, ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే దిశగా మరికొందరికి స్ఫూర్తినిస్తుందని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతకుముందు, ప్రధాని పిలుపు మేరకు సల్మాన్ ఖాన్ ముంబయిలోని కర్జాత్ ప్రాంతంలో చీపురు పట్టి చెత్తను తొలగించాడు. ఆ ఫొటోలను తన ఫేస్ బుక్ పేజీలో పెట్టాడు.