: రఘువీరాపై మాజీ మంత్రి డొక్కా ఫైర్
ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఫైర్ అయ్యారు. ఆళ్లగడ్డలో వైకాపా అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థిని పోటీకి నిలపకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమా నాగిరెడ్డి అంటే భయమా? లేక బంధుత్వమా? అంటూ రఘువీరాపై మండిపడ్డారు. నందిగామ ఉప ఎన్నికలో దళితుడైన టీడీపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టారని నిలదీశారు. పీసీసీ వైఖరి దళితులకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. రఘువీరా ఒంటెద్దు పోకడలపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని అన్నారు.