: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇకపై పోలీస్ స్టేషన్ గడప ఎక్కాల్సిన పనిలేదు
నయా పోలీసింగ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సరికొత్త కార్యక్రమానికి నిన్న శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం పేరు 'ఎఫ్ఐఆర్ ఎట్ యువర్ డోర్ స్టెప్స్'(ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు కార్యక్రమం). దీని కోసం కొనుగోలు చేసిన కొత్త వాహనాలను పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నిన్న ప్రారంభించారు. ఇంతవరకు ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెడితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేవారు. కానీ, ఈ సరికొత్త కార్యక్రమం ద్వారా ఏదైనా ఫిర్యాదు చేయాలంటే పోలీస్ స్టేషన్ కు ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేదు. ఫిర్యాదు దారుడు పోలీస్ కంట్రోల్ రూం కు ఓ ఫోన్ చేస్తే చాలు, పోలీసులు స్వయంగా ఫిర్యాదు దారుడు లేదా బాధితుడి ఇంటికి వచ్చి కంప్లైంట్ తీసుకుని, కేసును రిజిష్టర్ చేసుకుని, ఎఫ్ఐఆర్ ను స్వయంగా నమోదు చేసుకుంటారు. ఈ విధానం ద్వారా కేసు నమోదుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి గంటల పాటు నిరీక్షించే బాధ ప్రజలకు తప్పుతుందని ఏపీ పోలీస్ వర్గాలు అంటున్నాయి.