: నేడు విశాఖ వెళుతున్న చంద్రబాబు... దీపావళి రోజున అక్కడే


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు విశాఖకు వెళుతున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖ చేరుకుంటారు. అనంతరం, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన సహాయక చర్యలను పరిశీలిస్తారు. తర్వాత కలెక్టరేట్ చేరుకుని అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం బీచ్ రోడ్డులో జరిగే కాగడాల ప్రదర్శనలో చంద్రబాబు పాల్గొంటారు. దీపావళి పండుగ నాడు (రేపు) చంద్రబాబు విశాఖలోనే గడిపే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News