: రోషన్ మహానామా అరుదైన రికార్డు
శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ మహానామా అరుదైన రికార్డు సాధించాడు. క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత మ్యాచ్ రిఫరీగా మహానామా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిఫరీగా మహానామా 200 వన్డేలను పూర్తి చేసుకున్నాడు. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాల మధ్య జరిగిన తొలి వన్డేతో మహానామా ఈ రికార్డును సాధించాడు. ఇప్పటి వరకు మహానామాతో పాటు మరో ముగ్గురు మాత్రమే 200 క్లబ్ లో చేరారు.