: ఇక మొబైల్ ద్వారా ఎయిరిండియా టికెట్లు


ఎయిరిండియా విమానయాన సంస్థ ఓ మొబైల్ యాప్ ను లాంచ్ చేసింది. దీని ద్వారా వినియోగదారులు త్వరితగతిన, సులువుగా, సౌకర్యవంతంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది. ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ యాప్ ను యాక్సెస్ చేయవచ్చని తెలిపింది. సంస్థ సీఎండీ రోహిత్ నందన్ ఈ యాప్ ను ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపైనే పనిచేస్తుంది. త్వరలోనే దీన్ని ఐఫోన్ ఆధారిత యాప్ గా అభివృద్ధి చేయనున్నారు. ఈ మొబైల్ యాప్ ద్వారా టికెట్ల బుకింగ్, చెక్ ఇన్ వివరాలు, చార్జీల గురించి తెలుసుకోవడం, ఆహారం, వీల్ చెయిర్ వంటి సౌకర్యాలు పొందడం సాధ్యమవుతుంది.

  • Loading...

More Telugu News